Hima Das : భారత స్టార్ స్ప్రింటర్ హిమా దాస్(Hima Das)కు జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ(NADA) షాకిచ్చింది. డోప్ పరీక్షలో విఫలమైన ఆమెను సస్పెండ్ చేసింది. ఏడాది కాలంలో హిమ మూడు సార్లు డోప్ పరీక్ష(Doping Test)లో దొరికిపోయింది. ఇంటర్నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(WADA) ప్రకారం ఎవరైనా ఒకే సంవత్సరంలో మూడు సార్లు డోప్ టెస్టులో ఫెయిల్ అయితే వాళ్లు నియమాల్ని ఉల్లంఘించినట్టే. అందుకని నాడా ఆమెపై రెండేళ్ల నిషేధం విధించింది. ‘అవును.. హిమ ఈ 12 నెలల్లో 3 సార్లు డోప్ పరీక్షలో విఫలమైంది. అందుకని ఆమెను సస్పెండ్ చేయాల్సి వచ్చింది’ అని భారత అధికారి ఒకరు తెలిపాడు. అయితే.. హిమ తప్పిదాన్ని బట్టి రెండేళ్ల సస్పెన్షన్‌ను ఏడాదికి తగ్గించే అవకావం ఉంది.
అస్సాంకు చెందిన హిమ కొన్నాళ్లుగా వెన్నెముక కింది భాగంలో నొప్పితో బాధ పడుతోంది. ఈ ఏప్రిల్‌లో బెంగళూరులో జరిగిన గ్రాండ్ పిక్స్(Grand Prix) పోటీల్లో ఆమె తొడ కండరాలకు(Harmstring Injury) గాయమైంది. దాంతో, వైద్య పరీక్షల అనంతరం ట్రీట్మెంట్ తీసుకుంది. అందుకనే ఆమె రాంచీలో జరిగిన ఫెడరేషన్ కప్, అంతర్ రాష్ట్ర చాంపియన్‌షిప్ పోటీలకు దూరమైంది. సరిగ్గా అదే సమయంలో భువనేశ్వర్‌లో ఆసియా గేమ్స్ ఫైనల్ సెలెక్షన్స్ జరిగాయి.
ఆసియా గేమ్స్‌లో హిమ దాస్‌కు గొప్ప రికార్డు ఉంది. 2018లో జకర్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో హిమ 400 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకంతో మెరిసింది. అంతేకాదు 4x400m మీటర్ల మహిళల రీలేలో బంగారు పతకం, మిక్స్డ్ 4x400m మీటర్ల రేలేలో సిల్వర్ మెడల్ గెలిచిన భారత జట్టులో హిమ సభ్యురాలు.