ICC World Cup – Mahindra | ఐసీసీ వరల్డ్ కప్ స్పాన్సర్‌గా ‘మహీంద్రా’
ICC World Cup - Mahindra | వచ్చే నెలలో జరిగే ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్-2023కి కో స్పాన్సర్ గా మహీంద్రా అండ్ మహీంద్రా వ్యవహరించనున్నది.
ICC World Cup – Mahindra | ప్రముఖ దేశీయ కార్పొరేట్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. దేశీయంగా క్రికెట్‌ను ప్రోత్సహించడానికి కీలక నిర్ణయం తీసుకున్నది. క్రికెట్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపింది. వచ్చేనెలలో జరిగే ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2023’కి స్టార్ స్పోర్ట్స్ తో కలిసి అసోసియేట్ స్పాన్సర్‌గా నిలువనున్నది. డిజిటల్ ప్లాట్ ఫామ్ ‘డిస్నీ + హాట్ స్టార్’ కూడా స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నది. తద్వారా తమ కార్ల విక్రయాలు పెంచుకోవాలని మహీంద్రా అండ్ మహీంద్రా తలపోస్తున్నది. భారత్‌లో ప్రస్తుతం అత్యంత ఆదరణ గల స్పోర్ట్ ఈవెంట్ క్రికెట్ మాత్రమే కావడం గమనార్హం.
భారతీయుల్లో క్రికెట్ పట్ల ఆదరణతోపాటు వచ్చేనెలలో పండుగల సీజన్ సందర్భంగా ఆడియన్స్‌తో కనెక్ట్ కావాలని మహీంద్రా భావిస్తున్నది. అక్టోబర్ 14న ఇండియా వర్సెస్ పాకిస్థాన్‌తోపాటు 48 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఎస్యూవీ కార్లు, ట్రాక్టర్ల ప్రచారానికి ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ స్పాన్సర్ షిప్ కీలకం కానున్నదని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఐసీసీ వరల్డ్ కప్ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా డీలర్ల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

