Under-19 World Cup : అండర్ -19 వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు రెచ్చిపోయారు. పసికూన యూఎస్ఏ బ్యాటర్లను వణికిస్తూ వికెట్ల వేట కొనసాగించారు. పేసర్ హెనిల్ పటేల్(5-16) ప్రత్యర్థి టాపార్డర్‌ను కకావికలం చేస్తూ ఐదు వికెట్లతో రెచ్చిపోయాడు. మిగతావారు సైతం ఓ చేయి వేయగా.. ప్రత్యర్థి జట్టు 35.2 ఓవర్లలోనే 110 పరుగులకే పరిమితమైంది. స్వల్ప లక్ష్యాన్ని తక్కువ ఓవర్లలోనే అందుకుంటే టీమిండియా భారీ విజయం నమోదు చేయడం పక్కా.
జింబాబ్వేలోని బులావయాలో మొదలైన అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టు ఘన విజయం కొట్టేలా ఉంది. టాస్ గెలిచి యూఎస్ఏను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ఆయుష్ మాత్రే(Ayush Mhatre) నిర్ణయానికి న్యాయం చేశారు బౌలర్లు. ముఖ్యంగా హెనిల్ పటేల్(5-16) సంచలన స్పెల్‌లో యూఎస్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు.
𝗙𝗜𝗙𝗘𝗥!
Henil Patel shines bright in the #U19WorldCup opener against USA U19 🔥
Updates ▶️ https://t.co/AMFM5Bk4oI pic.twitter.com/artSUGSyAZ
— BCCI (@BCCI) January 15, 2026
హెనిల్ విజృంభణతో 39కే ఐదు వికెట్లు పడడంతో ప్రత్యర్థి కోలుకోలేదు. విధ్వంసక బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(1-2) సైతం బంతితో రాణించాడు. చివరి బ్యాటర్‌ను ఔట్ చేయడంతో యూఎస్ ఏ 35.2 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటయ్యింది. అమెరికా జట్టులో నితిశ్ సుదిని 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
It’s a Henil Patel show here! 🎉💥
A splendid fifer on the first day of the campaign. ✋#ICCMensU19WC | #INDvUSA 👉 LIVE NOW ➡️ https://t.co/RdmIHbr8CB pic.twitter.com/0QaT8mZ3gX
— Star Sports (@StarSportsIndia) January 15, 2026