పోచెఫ్స్ట్రామ్ : వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1-1గా సమం చేసింది.
తొలుత వెస్టిండీస్ 48.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌట్ కాగా, సమాధానంగా దక్షిణాఫ్రికా 29.3 ఓవర్లలో 6 వికెట్లకు 264 పరుగులు చేసి గెలుపొందింది. హెన్రిక్ క్లాసెన్ అజేయ సెంచరీ(119నాటౌట్)తో జట్టును గెలిపించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.