హైదరాబాద్, ఆట ప్రతినిధి: యువ బాడీబిల్డర్స్ను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన స్టీల్ మ్యాన్ క్లాసిక్ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ విజయవంతమైంది. పలు రాష్ర్టాలకు చెందిన 200 మంది బాడీ బిల్డర్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 5 కేటగిరీల్లో 10 వెయిట్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు.
విజేతలకు రూ.5 లక్షల ప్రైజ్మనీ అందజేశారు. తొలిసారిగా నిర్వహించిన స్టీల్ మ్యాన్ క్లాసిక్ చాంపియన్షిప్నకు అనూహ్య స్పందన వచ్చిందని ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ మహేశ్ యాదవ్ అన్నారు.