అడిలైడ్: అడిలైడ్ టెస్టులో వెదర్(Travis Head Vs Mohammad Siraj) హీటెక్కింది. సెంచరీ జోష్‌తో దూకుడుగా ఆడుతున్న ట్రావిస్ హెడ్.. ఆవేశానికి లోనై సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సిరాజ్ వేసిన 22వ ఓవర్లో ట్రావిస్ హెడ్ హిట్టింగ్‌కు దిగాడు. తొలి బంతిని ఫోర్‌గా మలిచాడు. రెండో బంతికి పరుగు రాలేదు. ఇక మూడవ బంతికి ఫ్లిక్ షాట్‌తో సిక్సర్ కొట్టాడు హెడ్. అయితే నాలుగవ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఆసీస్ బ్యాటర్. భారీ షాట్లు కొట్టిన హెడ్‌పై.. బౌల్డ్ చేసిన తర్వాత సిరాజ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఆ టైంలో ట్రావిస్ హెడ్ కూడా తన టెంపర్ కోల్పోయాడు. సిరాజ్‌ను తిడుతూ ట్రావిస్ వెళ్లిపోయాడు. భారత బౌలర్ కూడా అసందర్భమైన సంకేతాలిచ్చాడు. ట్రావిస్ హెడ్ 141 బంతుల్లో 140 రన్స్ చేసి ఔటయ్యాడు.
There was a bit happening here between Head and Siraj after the wicket 👀#AUSvIND pic.twitter.com/f4k9YUVD2k
— 7Cricket (@7Cricket) December 7, 2024
ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆ జట్టుకు 157 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్, బుమ్రాలు చెరి నాలుగు వికెట్లను ఖాతాలో వేసుకున్నారు.