IPL 2025 : సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో వికెట్ కోల్పోయింది. డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(47) బౌల్డ్ అయ్యాడు. హాఫ్ సెంచరీకి చేరువైన అతడిని ప్రిన్స్ యాదవ్ ఇన్‌స్వింగర్‌తో బోల్తా కొట్టించాడు. దాంతో, 76 వద్ద హైదరాబాద్ మూడో వికెట్ పడింది. ప్రస్తుతం నితీశ్ కుమార్ రెడ్డి(23), హెన్రిచ్ క్లాసెన్(14)లు ధాటిగా ఆడుతున్నారు. 10 ఓవర్లకు స్కోర్.. 96-3.
ఉప్పల్ స్టేడియంలో రజాస్థాన్ రాయల్స్‌కు చెక్ పెట్టిన హైదరాబాద్‌కు లక్నో పేసర్ ఆదిలోనే శార్థూల్ ఠాకూర్ పెద్ద షాకిచ్చాడు. తన రెండో ఓవర్.. వరుస బంతుల్లో ఓపెనర్ అభిషేక్ శర్మ(6), గత మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్(0)లను వెనక్కి పంపాడు.
You miss, I hit 🎯
Prince Yadav gets the huge wicket of Travis Head as his maiden #TATAIPL dismissal 👏
Updates ▶ https://t.co/X6vyVEuZH1#SRHvLSG | @LucknowIPL pic.twitter.com/VT3yLLlN9J
— IndianPremierLeague (@IPL) March 27, 2025
15 పరుగులకే రెండు వికెట్లు పడగా.. ఓపెనర్ ట్రావిస్ హెడ్(47), నితీశ్‌తో కలిసి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒత్తిడి లోనవ్వకుండా బౌండరీలతో స్కోర్ వేగం పెంచాడు. అయితే.. ప్రిన్స్ ఓవర్లో షాట్‌కు యత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్లాసెన్, నితీశ్‌లు సమయోచితంగా ఆడుతున్నారు.