ప్రస్తుతం భారత క్రీడాభిమానులు అంతా మాట్లాడుకుంటున్న అంశం టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో ఎవరిని ఎంచుకోవాలనే. ఒక్కో సిరీస్ ముగిసేకొద్దీ ఈ చర్చ మరింత తీవ్రతరం అవుతోంది. ఈ క్రమంలోనే భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత యువపేసర్ హర్షల్ పటేల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్ రోహిత్ శర్మకు అందుబాటులో ఉండే ట్రంప్ కార్డ్ అతనే అవుతాడని సన్నీ అన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లుత తీసిన బౌలర్‌గా నిలిచిన పటేల్.. కచ్చితంగా ఆస్ట్రేలియాలో ఆడే జట్టులో ఉండాలని అభిప్రాయపడ్డాడీ లెజెండరీ బ్యాటర్.
‘‘బుమ్రా, షమీ, భువనేశ్వర్తోపాటు హర్షల్ కూడా ఉంటే.. రోహిత్‌కు అతనే ఒక ట్రంప్ కార్డ్ అవుతాడు’’ అని చెప్పాడు. ఒత్తిడిని అద్భుతంగా హాండిల్ చేస్తాడని, అతను కచ్చితంగా భారత జట్టుకు ఆస్తిగా మారతాడని జోస్యం చెప్పాడు. మరి టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో హర్షల్‌కు చోటు దక్కుతుందో లేదో చూడాలి.