హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్, ఆసియాకప్ టోర్నీలకు ఎంపికైన రాష్ట్ర యువ ఆర్చర్ చికితారావుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు చేయూత అందించారు. మంగళవారం హైదరాబాద్‌లో జగన్‌ను చికిత మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న చికిత సరైన ప్రోత్సాహం లేదని తెలుసుకున్న జగన్..చికితకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు.
అక్షర విద్యాసంస్థల నుంచి ఈ యువ ఆర్చర్‌కు 10లక్షల స్పోర్ట్స్ స్కాలర్షిప్ ఇవ్వనునన్నట్లు తెలిపారు. తొలి విడతగా రూ.50 వేల చెక్ అందించగా, వచ్చే ఫిబ్రవరి నుంచి శిక్షణ కోసం ప్రతి నెల 15వేల ఉపకారవేతనం ఐదేళ్ల పాటు అందిస్తామని జగన్ స్పష్టం చేశారు.