ముంబై: భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన రెండో టీ20లో విండీస్ 9 వికెట్ల తేడాతో టీమ్ఇండియాపై ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని విండీస్ వికెట్ నష్టానికి 15.4 ఓవర్లలో విజయాన్నందుకుంది. కెప్టెన్ హిలీ మాథ్యూస్ (47 బంతుల్లో 85 నాటౌట్, 17ఫోర్లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో కదంతొక్కింది. భారత బౌలర్లను ఉతికి ఆరేస్తూ జట్టుకు అలవోక విజయాన్ని అందించింది. టీమ్ఇండియా పేలవ ఫీల్డింగ్ కొంపముంచగా, సైమా ఠాకూర్ ఏకైక వికెట్ దక్కింది. తొలుత కెప్టెన్ స్మృతి మందన (62), రీచా ఘోష్ (32) రాణించడంతో భారత్ 20 ఓవర్లలో 159/9 స్కోరు చేసింది. హెన్రీ, డాటిన్, మాథ్యూస్, ఫ్లెచర్ రెండేసి వికెట్లు తీశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించిన మాథ్యూస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.