SL vs Oman | వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్.. 10 వికెట్ల తేడాతో ఒమన్‌ను చిత్తు చేసిన శ్రీలంక
SL vs Oman : మాజీ చాంపియన్ శ్రీలంక వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్(World Cup Qualifiers 2023)లో అదరగొడుతోంది. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్(Queens Sports Club)లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పసికూన ఒమన్ జట్టుపై భారీ విజయం సాధించింది. స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ(Wanindu Hasaranga) 5 వికెట్లతో చెలరేగాడు. దాంతో, శ్రీలంక....
SL vs Oman : మాజీ చాంపియన్ శ్రీలంక వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్(World Cup Qualifiers 2023)లో అదరగొడుతోంది. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్(Queens Sports Club)లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పసికూన ఒమన్ జట్టుపై భారీ విజయం సాధించింది. స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ(Wanindu Hasaranga) 5 వికెట్లతో చెలరేగాడు. దాంతో, శ్రీలంక 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో, గ్రూప్ బి పాయింట్ల పట్టికలో లంక అగ్రస్థానికి చేరింది. ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు ఆడిన లంక రెండింటిలోనూ నెగ్గింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన ఒమన్‌ను హసరంగ దెబ్బకొట్టాడు. 13 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. దాంతో, ఒమన్ టీమ్ 98 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని లంక వికెట్ కోల్పోకుండా 15 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ దిముత్ కరుణరత్నే(61 నాటౌట్) అర్ధ సెంచరీతో కదం తొక్కాడు. మరో ఓపెనర్ ప్రథుమ్ నిస్సంక(37) నాటౌట్‌గా నిలిచాడు. సంచలన బౌలింగ్ ప్రదర్శన చేసిన హసరంగ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
అక్టోబర్ 5న వరల్డ్ కప్
ఒమన్‌పై భారీ విజయంతో లంక ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ అవకాశాలు మెరుగుపరుచుకుంది. గ్రూప్ -ఏ, గ్రూప్ -బిలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు వరల్డ్ కప్‌లో ఆడేందుకు అర్హత సాధిస్తాయి. ఈఏడాది వన్డే వరల్డ్ కప్(ODI WC 2023) భారత సొంత గడ్డపై జరగనుంది. అక్టోబర్ 5న ఈ మెగా టోర్నీషురూ కానుంది. దాంతో ఈసారి కప్పు కొట్టి.. 10 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.
ఇవి కూడా చదవండి
TeamIndia | భారత జట్టు ఐసీసీ ట్రోఫీ గెలిచి ఈ రోజుకి పదేళ్లు.. అదీ ధోనీ కెప్టెన్సీలోనే
Messi – Mbappe | పీఎస్జీని వదిలేసి మాడ్రిడ్ క్లబ్లో చేరు.. ఎంబాపేను కోరిన మెస్సీ..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

