Messi – Mbappe | పీఎస్జీని వదిలేసి మాడ్రిడ్ క్లబ్లో చేరు.. ఎంబాపేను కోరిన మెస్సీ..!
Messi - Mbappe : అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ(Lionel Messi) కొత్త క్లబ్‌కు మారిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఇంటర్ మియామి(Inter Miami,) క్లబ్ తరఫున అతను వచ్చే సీజన్లో బరిలోకి దిగనున్నాడు. అయితే.. పీఎస్జీ(Paris Saint-Germain) క్లబ్‌ను వీడేముందు ఈ స్టార్ ఆటగాడు తన సహచరుడు కైలియన్ ఎంబాపే(Kylian Mbappe)ను కూడా క్లబ్‌ను వదిలేయమని...
Messi – Mbappe : అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ(Lionel Messi) కొత్త క్లబ్‌కు మారిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఇంటర్ మియామి(Inter Miami,) క్లబ్ తరఫున అతను వచ్చే సీజన్లో బరిలోకి దిగనున్నాడు. అయితే.. పీఎస్జీ(Paris Saint-Germain) క్లబ్‌ను వీడేముందు ఈ స్టార్ ఆటగాడు తన సహచరుడు కైలియన్ ఎంబాపే(Kylian Mbappe)ను కూడా క్లబ్‌ను వదిలేయమని కోరాడట.
‘పీఎస్జీని వదిలెయ్. రియల్ మాడ్రిడ్(Real Madrid) లేదా బార్కా(Barca) క్లబ్‌తో ఒప్పందం చేసుకో’… అని మెస్సీ అతడికి సలహా ఇచ్చాడనే వార్తలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ వార్తలపై మెస్సీగానీ, ఎంబాపేగానీ ఇంతవరకు స్పందించలేదు. మరోవైపు. తాను వచ్చే సీజన్లోనూ పీఎస్జీకి ఆడతానని ఎంబాపే ఇప్పటికే ప్రకటించాడు. తాను క్లబ్ నుంచి పెద్దగా ఏం ఆశించడం లేదని, క్లబ్ తీరుపట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. మెస్సీ, ఎంబాపే, నెయ్మర్ జూనియర్… పీఎస్జీ క్లబ్లో సభ్యులు. ఖతర్ వరల్డ్ కప్ తర్వాత ఈ ముగ్గురు ఆ క్లబ్ తరఫున సౌదీ ప్రో లీగ్‌లో ఆడారు.

ఆ రెండు క్లబ్స్‌ను కాదని…
జూన్ 30వ తేదీన పీఎస్జీ క్లబ్ తరఫున మెస్సీ ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. రెండేళ్ల కాంట్రాక్ట్ ముగియడంతో అతను పీఎస్జీకి గుడ్ బై చెప్పాడు. దాంతో, వచ్చే సీజన్లో అతను ఏ క్లబ్‌కు ఆడతాడు? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. స్పెయిన్‌కు చెందిన బార్సిలోనా(Barcelona), సౌదీ అరేబియా క్లబ్ అల్ – హిలాల్(Al Hilal ) క్లబ్స్ ఈ దిగ్గజ ఆటగాడితో ఒప్పందం కోసం ప్రయత్నించాయి. కానీ, మెస్సీ మాత్రం మియామి క్లబ్‌కు ఓకే చెప్పాడు. మెస్సీ నిరుడు అర్జెంటీనా(Arjentina)కు వరల్డ్ కప్ అందించాడు. రెండోసారి అర్జెంటీనాను ఫైనల్‌కు చేర్చిన అతను తన వరల్డ్ కప్ కలను నిజం చేసుకున్నాడు. ఫ్రాన్స్‌తో జరిగిన టైటిల్ పోరులో మెస్సీ రెండు గోల్స్ కొట్టాడు. ఎంబాపే హ్యాట్రిక్ గోల్స్‌తో హడలెత్తించినా చివరకు షూటౌట్లో 4-2తో అర్జెంటీనా గెలుపొందింది.
ఇవి కూడా చదవండి
Suresh Raina | నెదర్లాండ్స్ లో రెస్టారెంట్ ఓపెన్ చేసిన రైనా.. పిక్స్ వైరల్
BCCI | వెస్టిండీస్ టూర్.. నయా వాల్‌పై వేటు.. వన్డే జట్టులోకి శాంసన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

