Suresh Raina | టీం ఇండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) గతేడాది సెప్టెంబర్ లో క్రికెట్ కు గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రైనా ఓ కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. అదే హోటల్ బిజినెస్. యూరప్ నడిబొడ్డున నెదర్లాండ్స్ (Netherlands) రాజధాని ఆమ్స్టర్డామ్ (Amsterdam)లో ఇండియన్ రెస్టారెంట్ (Indian restaurant) నెలకొల్పాడు. దానికి ‘రైనా ఎస్ ఆర్’ అని పేరు పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
‘ఆమ్స్టర్డామ్ లో రైనా ఇండియన్ రెస్టారెంట్ ను పరిచయం చేయడానికి సంతోషిస్తున్నాను. ఇక్కడ ఆహారం, వంట పట్ల నా అభిరుచి ప్రత్యేకంగా ఉంటుంది..! ఇప్పటి వరకు నాకు ఆహారం పట్ల ఉన్న ప్రేమ, నా వంటల సాహసాలను చూశారు. భారత్ కు మాత్రమే పరిమితమైన రుచులను ఆమ్స్టర్డామ్ లోని నా రెస్టారెంట్ ద్వారా ఇక్కడి ప్రజలకు పరిచయం చేస్తాను. ఉత్తర భారతదేశానికి చెందిన మసాలా వంటకాల నుంచి దక్షిణ భారతదేశ ఘుమఘుమలు నా రెస్టారెంట్ కు వచ్చిన వారికి నోరూరించేలా చేస్తాను. ఈ రెస్టారెంట్ లో వంటకాలు మాత్రమే కాదు, నాణ్యత ప్రమాణాలు, ప్రతి డిష్ లోనూ సంపూర్ణ సంతృప్తిని అందించడంలో మా అంకిత భావాన్ని చూస్తారు’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు రైనాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read..
Hijacking | విమానంలో హైజాకింగ్ గురించి ఫోన్ సంభాషణ.. ప్రయాణికుడు అరెస్ట్
Cobra | ప్లాస్టిక్ డబ్బా మింగేసిన నాగుపాము.. శస్త్రచికిత్స ద్వారా తొలగించిన వైద్యులు
Shehbaz Sharif | మహిళా అధికారిణి చేతిలోని గొడుగు తీసుకెళ్లిపోయిన పాక్ ప్రధాని.. నెట్టింట ట్రోల్స్