SL vs BAN : ఆసియా కప్ గ్రూప్ బీలోని శ్రీలంక (Srilanka) తొలి మ్యాచ్ ఆడుతోంది. షేక్ జయెద్ స్టేడియంలో బంగ్లాదేశ్‌ను లంక ఢీకొడుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక సారథి చరిత అసలంక బౌలింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా జింబాబ్వే పర్యటనకు దూరమైన మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగ తుది జట్టులో ఉన్నాడని అసలంక తెలిపాడు.
బంగ్లా విషయానికొస్తే.. ప్రధాన పేసర్ తస్కిన్ అందుబాటులో లేడు. అతడి స్థానంలో షొరిఫుల్ ఇస్లాం జట్టులోకి వచ్చాడని కెప్టెన్ లిటన్ దాస్ వెల్లడించాడు. తమ మొదటి మ్యాచ్‌లో హాంకాంగ్ జట్టుపై విజయంతో బోణీ కొట్టింది బంగ్లా. ఈ గేమ్‌లోనూ భారీ స్కోర్ సాధించి సూపర్ 4 అవకాశాల్ని మెరుగుపరచుకోవాలని లిటన్ బృందం భావిస్తోంది.
Sri Lanka begin their Asia Cup campaign 🏏#AsiaCup2025 LIVE 👉 https://t.co/3X9o1nkWFw pic.twitter.com/5QbtwjBsS4
— ESPNcricinfo (@ESPNcricinfo) September 13, 2025
శ్రీలంక తుది జట్టు : పథుమ్ నిశాంక, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), కమిల్ మిషార, కుశాల్ పెరీరా, చరిత్ అసలంక(కెప్టెన్), కమిందు మెండిస్, దసున్ శనక, వనిందు హసరంగ, దుష్మంత చమీర, మథీశ పథిరన, నువాన్ తుషార.
బంగ్లాదేశ్ తుది జట్టు : పర్వేజ్ హొసేన్ ఎమోన్, తంజిద్ హసన్, లిటన్ దాస్(కెప్టెన్, వికెట్ కీపర్), తౌహిద్ హ్రిదయ్, జకీర్ అలీ, షమీం హొసేన్, మెహిదీ హసన్, రిషద్ హొసేన్, తంజిమ్ హసన్, షొరిఫల్ ఇస్లాం, ముస్తాఫిజుర్.