Asian Para Championship : ఆసియా పారా ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ హర్వీందర్ సింగ్ డబుల్ ధమాకాతో అదరగొట్టాడు. పోటీల చివరి రోజు ఏకంగా మూడు స్వర్ణాలతో భారత్‌ను పట్టికలో రెండో స్థానంలో నిలిపాడు. వ్యక్తిగత రికర్వ్, మిక్స్డ్ డబుల్స్‌లో మాజీ వరల్డ్ నంబర్ 1 అయిన హర్విందర్ రాణించడంతో ఈసారి భారత్ మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలు గెలుపొందింది. ఆతిథ్య చైనా అగ్రస్థానంతో టోర్నీని ముగించింది.
ఆదివారం పురుషుల రికర్వ్ ఫైనల్లో హర్వింద్ చైనా ఆర్చర్‌కు చెక్ పెట్టాడు. అనంతరం రికర్వ్ మిక్స్డ్ పోటీలో హర్విందర్, భావనా జోడీ చైనా జంటను ఓడించి పసిడి పతకం సాధించింది. థాయ్‌లాండ్ ఆర్చర్ హనెరచాయ్ నెట్సిరీని రెండో స్థానానికి పరిమితం చేసిన హర్విందర్ మూడో గోల్డ్ ఖాతాలో వేసుకున్నాడు.