IPL 2023 | విజృంభించిన బౌలర్లు.. రాజస్థాన్‌కు షాకిచ్చిన కోహ్లీ సేన
IPL 2023 : పదహారో సీజన్ ఐపీఎల్లో మరో హారాహోరి పోరు అభిమానులను అలరించింది. సొంత గ్రౌండ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గర్జించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో కోహ్లీ సేన టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. బౌలర్లు విజృంభించడంతో రాజస్థాన్‌పై 7 పరుగుల తేడాతో గెలిచింది.
IPL 2023 : పదహారో సీజన్ ఐపీఎల్లో మరో హారాహోరి పోరు అభిమానులను అలరించింది. సొంత గ్రౌండ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గర్జించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో కోహ్లీ సేన టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. బౌలర్లు విజృంభించడంతో రాజస్థాన్‌పై 7 పరుగుల తేడాతో గెలిచింది. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(62), గ్లెన్ మ్యాక్స్‌వెల్(77) అర్థ శతకంతో చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత సంజూ శాంసన్ బృందాన్ని 182 పరుగులకే కట్టడి చేసింది.
హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 20 పరుగులు అవసరమయ్యాయి. మొదటి బంతికి అశ్విన్(12) బౌండరీ కొట్టాడు. రెండో బతికి రెండు రస్ వచ్చాయి. మూడో బంతికి ఫోర్. నాలుగో బంతికి అశ్విన్ క్యాచ్ ఔటయ్యాడు. ఐదో బంతికి సింగిల్ వచ్చింది. ఆఖరి బంతికి 9 రన్స్ కావాలి. ధ్రువ్ జురెల్(33) సింగిల్ తీశాడు. దాంతో ఆర్సీబీ 7 పరుగుల తేడాతో గెలుపొందింది.
Innings Break!@rajasthanroyals found wickets at regular intervals but they have a tricky chase ahead of themselves!
Will @RCBTweets successfully defend their total?
Scorecard ▶️ https://t.co/lHmH28JwFm#TATAIPL | #RCBvRR pic.twitter.com/hyh3tbspSG
— IndianPremierLeague (@IPL) April 23, 2023
పడిక్కల్, యశస్వీ దంచినా..
లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. విధ్వంసక ఓపెనర్ జోస్ బట్లర్(0)ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(47) , దేవ్‌దత్ పడిక్కల్(52) రెండో వికెట్‌కు 99 పరుగులు చేశారు. హర్షల్ పటేల్ స్లోవర్ డెలివరీతో యశస్వీని బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత సంజూ శాంసన్(22) ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. షిమ్రన్ హెట్మెయిర్(3) విఫలమయ్యాడు. ధ్రువ్ జురెల్(33), అశ్విన్() ధనాధన్ ఆడినా జట్టును గెలిపించలేకపోయారు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. సిరాజ్, డేవిడ్ విల్లేకు ఒక్కో వికెట్ దక్కింది.
🔙 to 🔙 victories for @RCBTweets 😎
Impact Player @HarshalPatel23 gets the job done for his side as #RCB complete a 7-run win over #RR 🙌🏻
Scorecard ▶️ https://t.co/lHmH28JwFm#TATAIPL | #RCBvRR pic.twitter.com/tBfj4otND4
— IndianPremierLeague (@IPL) April 23, 2023
డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఫిఫ్టీ
చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు దంచికొట్టారు. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(62), గ్లెన్ మ్యాక్స్‌వెల్(77) అర్థ శతకంతో చెలరేగారు. దాంతో, ఆర్సీబీ9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ తొలి బంతికే డకౌటయ్యాడు. ఆ తర్వాత డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్ వేగంగా ఆడారు. 11 ఓవర్లకు స్కోర్ వంద దాటించారు. హాఫ్ సెంచరీ తర్వాత జోరు పెంచిన వీళ్లిద్దరు వెంట వెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత ఆర్సీబీ పరుగుల వేగం తగ్గింది. చివర్లో దినేశ్ కార్తిక్(16), మహిపాల్ లొమ్రోర్(8), వనిందు హసరంగ(6) ధాటిగా ఆడడంతో 180 ప్లస్ చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ రెండేసి వికెట్లు తీశారు. అశ్విన్, చాహల్‌కు ఒక్కో వికెట్ దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

