బెంగుళూరు: బౌలర్ హర్షల్ పటేల్‌పై కనకవర్షం కురిసింది. ఆ ప్లేయర్‌ను బెంగుళూరు దక్కించుకున్నది. ఇవాళ జరుగుతున్న ఐపీఎల్ వేలంలో హర్షల్ పటేల్‌ను ఆర్సీబీ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లోనూ హర్షల్ బెంగుళూరు జట్టుకే ఆడాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 5 వికెట్లు కూడా తీశాడు. 2 కోట్ల కనీస ధరతో హర్షల్ పటేల్‌పై బిడ్డింగ్ జరిగింది. అయితే వేలంలో రాజస్థాన్ జట్టు గట్టి పోటీ ఇచ్చింది. కానీ చివరకు స్వంత ప్లేయర్ హర్షల్‌ను మళ్లీ బెంగుళూరే దక్కించుకున్నది.