IPL 2025 : ఛేజింగ్‌లో బౌండరీలతో విరుచుకుపడుతున్న విరాట్ కోహ్లీ(43)ని సన్‌రైజర్స్ యువస్పిన్నర్ ఔట్ చేశాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన హర్ష్ దూబే(1-20) వల పన్ని మరీ విరాట్ వికెట్ సాధించాడు. ఆఫ్ సైడ్ ఆడేందుకు కోహ్లీ సిద్దం కాగా.. అతడిని గమనించిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తెలివిగా బంతిని బ్యాక్వర్డ్ పాయింట్లో ఆడేలా చేశాడు.
దాంతో.. కోహ్లీ వేరే దారి లేక బంతిని బ్యాక్‌వర్డ్‌లో ఆడగా. అక్కడే కాచుకున్న అభిషేక్ చక్కగా క్యాచ్ అందుకున్నాడు. అంతే.. తొలి వికెట్ బాగస్వామ్యానికి తెరపడింది. విరాట్ ఔటయ్యాక జూలు విదిల్చిన ఫిలిప్ సాల్ట్(44 నాటౌట్).. బౌండరీలతో విజృంభిస్తున్నాడు. హర్షల్ పటేల్ ఓవర్లో రెండు ఫోర్లు, హర్ష్ ఓవర్లో భారీ సిక్సర్ బాది అర్ధ శతకానికి చేరువయ్యాడు. 9 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 108 -1. మయాంక్ అగర్వాల్ 9 రన్స్‌తో ఆడుతున్నాడు.
A 𝙃𝙖𝙧𝙨𝙝 moment for #RCB!
Young Harsh Dubey strikes right after the powerplay to dismiss well-set Virat Kohli! 🧡
RCB need 136 runs in 72 deliveries.
Updates ▶ https://t.co/sJ6dOP9ung#TATAIPL | #RCBvSRH | @SunRisers pic.twitter.com/f2qkt18t0F
— IndianPremierLeague (@IPL) May 23, 2025