చెస్టర్ లీ స్ట్రీట్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ వన్డేలో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 46 రన్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది ఇంగ్లండ్. మూడవ వన్డేలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 304 రన్స్ చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ 60, గ్రీన్ 42, అలెక్స్ క్యారీ 77, మ్యాక్స్‌వెల్ 30, హార్డీ 44 రన్స్ చేశారు. ఆ తర్వాత భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఓ దశలో 11 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది.
అయితే ఆ సమయంలో క్రీజ్‌లోకి దిగిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్(Harry Brook) .. సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 94 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. కానీ అప్పటికే డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్ విక్టరీ ఖాయమైంది.
37.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 254 రన్స్ చేసిన ఇంగ్లండ్.. 46 రన్స్ తేడాతో విజయం సాధించింది. బ్రూక్స్ 110 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో విల్ జాక్స్ 84, లివింగ్‌స్టోన్ 33 రన్స్ చేశారు.
Harry Brook’s maiden ODI hundred ends Australia’s winning streak!#ENGvAUS 📝 https://t.co/7fm1IXF6S4 pic.twitter.com/nv03dByus8
— ICC (@ICC) September 24, 2024