ముంబై : ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్‌పై ఐపీఎల్లో రెండేండ్ల నిషేధం పడింది. 2024 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్రూక్‌ను రూ. 6.25 కోట్లకు దక్కించుకోగా వరుసగా రెండు సీజన్ల ఆరంభానికి ముందు అతడు పలు కారణాలతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఐపీఎల్ పాలకమండలి బ్రూక్‌పై కఠిన చర్యలకు దిగింది. తాజా నిర్ణయంతో బ్రూక్.. 2027 దాకా ఐపీఎల్‌కు దూరమవనున్నాడు.