IPL 2025 : జైపూర్‌లో చెలరేగి ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(50) ఔటయ్యాడు. హర్‌ప్రీత్ బ్రార్ ఓవర్లో సింగిల్ తీసి అర్ధ శతకం సాధించిన యశస్వీ.. మూడో బంతికి పెద్ద షాట్ ఆడాడు. కానీ, బౌండరీ వద్ద మిచెల్ ఓవెన్ సూపర్‌గా క్యాచ్ అందకున్నాడు. దాంతో, 109 వద్ద రాజస్థాన్ రెండో వికెట్ పడింది. ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరడంతో గెలుపు భారం కెప్టెన్ సంజూ శాంసన్(18 నాటౌట్), రియాన్ పరాగ్ (1)లపై పడింది. 9 ఓవర్లకు స్కోర్.. 110-2. ఇంకా సంజూ సేన విజయానికి 66 బంతుల్లో 110 రన్స్ కావాలి.
పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 220 ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ తమ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో యశస్వీ జైస్వాల్(50).. ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత మార్కో యాన్సెన్ ఓవర్లో వైభవ్ సూర్యవంశీ(40) తన ప్రతాపం చూపించి 6, 4, 6 బాదగా 17 రన్స్ వచ్చాయి. ఈ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్ల విధ్వంసంతో రాజస్థాన్ స్కోర్ 2 ఓవర్లకే 38కి చేరింది. అనంతరం గ్జావియర్ బార్ట్లెట్ బౌలింగ్‌లో యశస్వీ మూడు బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దాంతో.. 3 ఓవర్లకు స్కోర్ 50 దాటింది. ఈ సీజన్లో అత్యంత వేగంగా యాభై కొట్టిన జట్టుగా రాజస్థాన్ రికార్డు నెలకొల్పింది.
Raised the temperature with 𝙨𝙘𝙤𝙧𝙘𝙝𝙞𝙣𝙜 𝙨𝙝𝙤𝙩𝙨 🌡
14-year old Vaibhav Suryavanshi departs after a breathtaking 40(15) 😎#RR notch up their highest powerplay score ever- 89/1
Updates ▶ https://t.co/HTpvGewE3N #TATAIPL | #RRvPBKS | @rajasthanroyals pic.twitter.com/Zu6muZJokz
— IndianPremierLeague (@IPL) May 18, 2025
ఇక అర్ష్‌దీప్‌ను అరుసుకున్న వైభవ్ తొలి బంతికి ఫోర్.. ఆఖరి రెండు బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపి పంజాబ్ గుండెల్లో గుబులు పుట్టించాడు. ఈ జోడీని విడదీసేందుకు హర్‌ప్రీత్ బ్రార్‌ను రంగంలోకి దింపిన అయ్యర్ ఫలితం సాధించాడు. అతడి బౌలింగ్‌లో కొట్టిన వైభవ్.. మరో పెద్ద షాట్ ఆడబోయి యాన్సెన్ చేతికి చిక్కాడు. దాంతో, 76 వద్ద రాజస్థాన్ తొలి వికెట్ పడింది. అయినా సరే యశస్వీ జోరు తగ్గించకపోవడంతో రాజస్థాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది.