Harmanpreet Kaur | మహిళల ప్రీమియర్ లీగ్ వేలంపై కాదు.. మా దృష్టంతా ఆ మ్యాచ్ పైనే : హర్మన్‌ప్రీత్
తమ దృష్టంతా డబ్ల్యూపీఎల్ వేలంపై కాకుండా టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో జరగనున్న తొలి గేమ్‌పైనే ఉందని భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. ఫిబ్రవరి 13న మహిళల ప్రీమియర్ లీగ్ వేలం జరగనుంది.
Harmanpreet Kaur : తమ దృష్టంతా టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో జరగనున్న తొలి గేమ్‌పైనే ఉందని భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. ప్రస్తుతం జట్టంతా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ ) వేలంపై కాకుండా పాక్ మ్యాచ్‌పైనే ఫోకస్ పెట్టిందని ఆమె చెప్పింది. ‘మహిళల ప్రీమియర్ వేలానికి ముందు రోజు మాకు పాక్‌తో కీలకమైన మ్యాచ్ ఉంది. మాకు అన్నింటికంటే వరల్డ్ కప్ చాలా ముఖ్యమైనది. ఐసీసీ ట్రోఫీ నెగ్గడంపై అందరం దృష్టి సారించాం. మేమంతా ఎంతో పరిణితితో ఉన్నాం. ఒక ప్లేయర్‌గా ఏది ముఖ్యమో మాకు తెలుసు’ అని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వెల్లడించింది.
ఫిబ్రవరి 13న డబ్ల్యూపీఎల్ వేలం
ఈమధ్యే అండర్ -19 వరల్డ్ కప్ విజేత అయిన భారత జట్టు స్ఫూర్తితో ముందుకెళ్తామని హర్మన్ ఇంతకుముందే చెప్పింది. ఫిబ్రవరి 12 భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఆ మరుసరి రోజు (ఫిబ్రవరి 13న) మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ ) వేలం జరగనుంది. ఇప్పటికే పలువురు మహిళా క్రికెటర్లు వేలం పాటలో తమ పేరు రిజిష్టర్ చేసుకున్నారు.
రెండోసారి వరల్డ్ కప్ నెగ్గాలని
దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తున్న మహిళల టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 10న మొదలుకానుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. మూడు వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. వారం క్రితం సఫారీ గడ్డపై హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలోని భారత్ ముక్కోణపు సిరీస్ ఆడింది. అయితే.. చివరి మెట్టుపై తడబడి ట్రోఫీ చేజార్చుకుంది. వరల్డ్ కప్ ముందు అక్కడి పిచ్‌లపై ఆడడం ఇండియాకు కలిసిరానుంది. దాంతో, ఎలాగైనా రెండోసారి టీ20 వరల్డ్ కప్ నెగ్గాలనే పట్టుదలతో ఉంది. 2016లో టీమిండియా 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

