అడిలైడ్: మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత స్టార్ ప్లేయర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఫలితంగా శనివారం జరిగిన పోరులో మెల్బోర్న్ రెనిగేడ్స్ 15 పరుగుల తేడాతో బ్రిస్బేన్ హీట్‌ను చిత్తు చేసింది. మొదట మెల్బోర్న్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు చేసింది. ఓపెనర్లు జెమీమా (31 బంతుల్లో 52; 10 ఫోర్లు), ఈవ్ జోన్స్ (46 బంతుల్లో 62; 9 ఫోర్లు) హాఫ్‌సెంచరీలు చేసి భారీ స్కోరుకు బాటలు వేయగా.. భారత టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (32 బంతుల్లో 65; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగింది. అనంతరం లక్ష్యఛేదనలో బ్రిస్బేన్ జట్టు 20 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌటైంది. హర్మన్‌ప్రీత్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది. లీగ్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆమెకు ఇది మూడో అవార్డు కావడం విశేషం.