ఇంగ్లాండ్‌కు బయల్దేరేముందు ముంబైలోని హోటల్లో ఉన్న భారత మహిళా క్రికెటర్లు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. కఠిన క్వారంటైన్‌లోనూ చెమట చిందిస్తున్నారు. ఫిట్‌గా ఉండేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. క్వారంటైన్లో బోర్ కొట్టకుండా జిమ్‌లో వర్కౌట్స్‌తో సమయాన్ని గడుపుతున్నారు. మహిళా క్రికెటర్లు జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా తీసిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘షట్ ది నాయిస్! వుయ్ ఆర్ ఇండియా’ అని వ్యాఖ్యానించింది.
వీడియోలో మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన కనిపిస్తున్నారు. ఇంగ్లాండ్ టూర్లో భారత్ ఏకైక టెస్టు మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. జూన్ 16 నుంచి ప్రారంభమయ్యే నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌తో ఇరుజట్లు తమ సిరీస్‌ను ఆరంభించనున్నాయి.
Shut the Noise! We are INDIA 🇮🇳 #TogetherWeWin pic.twitter.com/5b2jFYQBIT
— BCCI Women (@BCCIWomen) May 27, 2021