INDW vs SLW : పొట్టి సిరీస్ చివరి మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (68) విధ్వంసక ఆటతో చెలరేగింది. ఓపెనర్లు విఫలమైనా.. మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించింది. పవర్ ప్లేలోనే రెండు వికెట్లు పడిన వేళ క్రీజులోకి వచ్చిన హర్మన్‌ప్రీత్ భారీ షాట్లతో విరుచుకుపడింది. హర్లీన్ డియోల్, దీప్తి శర్మలు విఫలమైనా అమన్‌జోత్ కౌర్(21)తో కలిసి స్కోర్‌బోర్డును ఉరికించింది. ఆరో వికెట్‌కు 61 రన్స్ జోడించింది. ఆఖరి ఓవర్లో అరుంధతి రెడ్డి(27) మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాదగా భారత్ 175 పరుగులు చేసింది.
నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో స్మృతిమంధానకు విశ్రాంతినిచ్చిన టీమిండియా.. పవర్ ప్లేలోనే ఓపెనర్లను కోల్పోయింది. హ్యాట్రిక్ అర్ధ శతకాలతో శ్రీలంక బౌలర్లను ఓ ఆట ఆడుకున్న షఫాలీ వర్మ(5) పెద్ద షాట్‌కు యత్నించి ఔటయ్యింది. అరంగేట్రం బ్యాటర్ కమలిని(12) ఆత్మవిశ్వాసంతోనే కనిపించినా.. ఎల్బీగా వికెట్ ఇచ్చేసింది. 27 పరుగులకే రెండు వికెట్లు పడిన వేళ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(10 నాటౌట్), హర్లీన్ డియోల్(13)తో ఇన్నింగ్స్ నిర్మించాలనుకుంది. కానీ, రష్మిక ఓవర్లో డియోల్ బౌల్డ్ కావడంతో 41వద్ద భారత్ మూడో వికెట్ పడింది. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్‌కు జోడీగా రీచా ఘోష్ (4 నాటౌట్) క్రీజులో ఉంది. 7 ఓవర్లకు స్కోర్.. 48-3.
In the groove! 💪
🎥 Fabulous ball-striking from #TeamIndia skipper Harmanpreet Kaur 👌
Updates ▶️ https://t.co/E8eUdWSj7U#INDvSL | @ImHarmanpreet | @IDFCFIRSTBank pic.twitter.com/SBuASav64b
— BCCI Women (@BCCIWomen) December 30, 2025
అనంతరం గేర్ మార్చిన హర్మన్‌ప్రీత్ రణవీర వేసిన 8వ ఓవర్లో మూడు ఫోర్లు బాది స్కోర్ 60 దాటించింది. అక్కడితో మొదలైన ఆమె ఉతుకుడుకు లంక ఫీల్డర్లు, బౌలర్లు బేజారయ్యారు. అమన్‌జోత్ కౌర్(21), కెప్టెన్ కలిసి ఆరో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పరు. అయితే.. రెండో సిక్సర్‌కు యత్నించి అమన్‌జోత్ బౌండరీ వద్ద చిక్కింది. సెంచరీ కొట్టేలా కనిపించిన హర్మన్‌ప్రీత్ అనూహ్యంగా దిల్హరి ఓవర్లో క్లీన్ బౌల్డయ్యింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అరుంధతి రెడ్డి(27 నాటౌట్) చివరి ఓవర్లో 4, 4, 6, 4 తో విరుచుకుపడింది. దాంతో. టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
Arundhati 𝙍𝙀𝘼(𝘿)𝘿𝙔 for the challenge 💪
A fiery cameo of 2⃣7⃣*(11) to power #TeamIndia to a strong total 🔥
Updates ▶️ https://t.co/E8eUdWSj7U#INDvSL | @reddyarundhati | @IDFCFIRSTBank pic.twitter.com/0rqFHwbglS
— BCCI Women (@BCCIWomen) December 30, 2025