INDW vs ENGW : ఛేదనలో దంచికొడుతున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(70) వెనుదిరిగింది. ఇంగ్లండ్ బౌలర్లను ఉతికేస్తూ హాఫ్ సెంచరీ బాదిన ఆమె.. ప్రత్యర్తి కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ ఓవర్లో కట్ షాట్ ఆడి క్యాచ్ ఇచ్చింది. అదే ఓవర్లో గ్యాప్‌లో బౌండరీ బాదిన కౌర్.. ఆ తర్వాత మాత్రం.. లాంబ్ చేతికి దొరికింది. దాంతో.. 125 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం స్మృతి మంధాన(68), దీప్తి శర్మ(4)లు జట్టును గెలింపించే ఇన్నింగ్స్ ఆడే పనిలో ఉన్నారు. 32 ఓవర్లకు భారత్ స్కోర్.. 177/3. మ్యాచ్ గెలవడానికి ఇంకా 122 రన్స్ కావాలి.
భారీ ఛేదనలో భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే లైఫ్ లభించినా ఓపెనర్ ప్రతీకా రావల్(6) సద్వినియోగం చేసుకోలేకపోయింది. పేసర్ లారెన్ బెల్ ఓవర్లో బౌండరీ బాదిన తను.. చివరి బంతికి షాట్‌కు యత్నించిం వికెట్ కీపర్ అమీ జోన్స్ చక్కని క్యాంచ్ అందుకుంది. దాంతో.. 13 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన హర్లీన్ డియోల్(24) లారెన్ బెల్ వేసిన 7వ ఓవర్లో రెండు బౌండరీలు బాది ఊపు తెచ్చింది. అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ బౌలింగ్‌లోనూ బౌండరీ బాదింది.
The skipper’s turn to bring up 5️⃣0️⃣ 🔝
Captain Harmanpreet Kaur also becomes just the 2️⃣nd #TeamIndia player to score 1000 runs in ICC women’s World Cups 🙌
Updates ▶ https://t.co/jaq4eHaH5w#WomenInBlue | #CWC25 | #INDvENG | @ImHarmanpreet pic.twitter.com/uGkpCfPYG8
— BCCI Women (@BCCIWomen) October 19, 2025
పవర్ ప్లే చివరి ఓవర్లో రెండో ఫోర్లతో జోరు చూపించిన తను.. చివరి బంతికి ఎల్బీగా ఔటయ్యింది. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70), స్మృతి మంధాన(68 నాటౌట్)తో కలిసి సాధికారిక ఇన్నింగ్స్ ఆడింది. ఇంగ్లండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఎకిల్‌స్టోన్, చార్లీ డీన్లను దీటుగా ఎదుర్కొన్న ఈ ద్వయం అర్ధ శతకాలతో జట్టు స్కోర్ 150 దాటించింది. హాఫ్ సెంచరీ తర్వాత జోరు పెంచిన కౌర్.. బ్రంట్ ఓవర్లో వెనుదిరగడంతో 167 వద్ద మూడో వికెట్ పడింది.