Harmanpreet Kaur : వరల్డ్ కప్ ట్రోఫీతో భారత మహిళల జట్టు చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) మరోసారి వార్తల్లో నిలిచింది. టీమిండియాకు వన్డే ప్రపంచ కప్ అందించిన మూడో కెప్టెన్‌గా చరిత్రకెక్కిన హర్మన్‌ప్రీత్ జట్టుకోసం ఈసారి పెద్ద త్యాగమే చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ (Womens Premier League)లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) తనను రెండో అత్యధిక ధరకు రీటైన్ చేసుకునేందుకు అంగీకరించింది. కానీ, నాట్ సీవర్ బ్రంట్(Nat Sciver Brunt)ను ఏకంగా రూ3.50 కోట్లకు ముంబై అట్టిపెట్టుకుంది ముంబై. ప్రస్తుతం అన్ని డబ్ల్యూపీఎల్ జట్లు రిటెన్షన్ జాబితాను ప్రకటించడంతో ముంబై తీసుకున్న ఈ నిర్ణయం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకూ.. హర్మన్ ఎందుకు అంగీకరించిందో తెలుసా..?
పదమూడో సీజన్ వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన హర్మన్‌ప్రీత్ కౌర్ డబ్ల్యూపీఎల్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆరంభ సీజన్లోనే ముంబైకి ట్రోఫీ అందించిన తను.. మూడో సీజన్లోనూ విజేతగా మురిసిపోయింది. ఇప్పుడు వరల్డ్ కప్ ఛాంపియన్‌గా ముంబైని నడిపించనున్న హర్మన్‌ప్రీత్‌ను భారీ ధరకు రీటైన్ చేసుకుంటారని అందరూ ఊహించారు. కానీ, ముంబై యాజమాన్యం క్రీడా విశ్లేషకులకు షాకిస్తూ నాట్ సీవర్ బ్రంట్‌కే ఓటేసింది.
Mumbai, पाहा आपले 𝐑𝐞𝐭𝐚𝐢𝐧𝐞𝐝 stars! 🤩#AaliRe #MumbaiIndians #TATAWPL pic.twitter.com/tXnmFD0L8m
— Mumbai Indians (@mipaltan) November 6, 2025
మామూలుగా అయితే వరల్డ్ కప్ విజేతగా హర్మన్‌కే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ, గత మూడు సీజన్లుగా ఫ్రాంచైజీ విజయాల్లో కీలమవుతున్న బ్రంట్ కోసం ఆమె వెనక్కి తగ్గింది. పోతే పోయింది ఒక కోటీ అనుకొని.. జట్టు ప్రయోజనం కోసం మేనేజ్మెంట్ నిర్ణయాన్ని శిరసావహించింది. దాంతో.. రూ.2.5 కోట్లకే కొనసాగేందుక తాను సిద్దపడింది.
నాలుగో సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఐదుగురిని అట్టిపెట్టుకోవాలనుకుంది. అయితే.. కెప్టెన్‌ను కాదని బ్రంట్‌కు భారీ ధర ఇవ్వాలని భావించిన యాజమాన్యం ఇదే విషయమై హర్మన్‌ను సంప్రదించింది. వరల్డ్ కప్‌లో సెంచరీతో పాటు బౌలింగ్‌లోనూ గొప్పగా రాణించిన ఇంగ్లండ్ కెప్టెన్‌ను కాస్త ఎక్కువకే రీటైన్ చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పగా.. అందుకు కౌర్ ఓకే అని చెప్పేసింది. తన గైర్హాజరీలో కెప్టెన్‌గా జట్టును నడిపించిన బ్రంట్‌ను వదులుకోవద్దనే ఉద్దేశంతో ఆమెకంటే కోటి తక్కువైనా సరే ఫ్రాంచైజీ ప్రయోజనాలకే సమ్మతం తెలిపింది. దాంతో.. ముంబై ఎటువంటి విభేదాలకు తావివ్వకుండా తమ రిటెన్షన్ పూర్తి చేసుకోగలిగింది. నవంబర్ 27న ఢిల్లీ వేదికగా జరగనున్న మెగా వేలంలో కొనాల్సిన క్రికెటర్ల గురించిన కసరత్తులో ముంబై టీమ్ నిమగ్నమైంది.
ముంబై ఇండియన్స్ : నాట్ సీవర్ బ్రంట్ (రూ.3.5 కోట్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (రూ.2.5 కోట్లు), హేలీ మాథ్యూస్(రూ.1.7కోట్లు), అమన్‌జోత్ కౌర్(రూ.1.0కోట్లు), జి. కమలిని(రూ.50 లక్షలు). ప్రస్తుతం ముంబై పర్స్‌లో 5.75 కోట్లు ఉన్నాయంతే.
🚨 THE RETENTION OF DEFENDING CHAMPIONS MUMBAI INDIANS 🚨 pic.twitter.com/5J97i89Qla
— Johns. (@CricCrazyJohns) November 6, 2025