Inna Makan : కారుతో ఢీకొట్టి బైకర్ మృతికి కారణమైన ఓ టీనేజర్ తండ్రి చెప్పిన ‘సారీ’ని మృతుడి
తల్లి తిరస్కరించింది. అతడి సారీని తిరస్కరిస్తున్నందుకు తాను కూడా ‘సారీ’ చెబుతున్నానని పేర్కొంది.
వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 3న ఢిల్లీ (Delhi) లోని ద్వారక ఏరియా (Dwaraka area) లో 17 ఏళ్ల యువకుడు కారులో వేగంగా వచ్చి.. బైక్‌పై వెళ్తున్న సాహిల్ ధనేశ్ర (Sahil Dhaneshra) అనే 23 ఏళ్ల వ్యక్తిని ఢీకొట్టాడు.
ఈ ఘటనలో సాహిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో నిందితుడిని జువైనల్ హోమ్
తరలించిన పోలీసులు.. 10వ తరగతి పరీక్షల కోసం కోర్టు అనుమతితో విడిచిపెట్టారు. దీనిపై ఇటీవల
నిందితుడి తండ్రి ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన
కొడుకు కారుతో ఢీకొట్టడంతో ఆమె కొడుకును కోల్పోయారని, అందుకు తాను సారీ చెబుతున్నానని
అన్నారు.
ఈ విషయాన్ని ఆ టీవీ ఛానెల్ మృతుడి తల్లి ఇన్నా మాకన్ దగ్గర ప్రస్తావించగా ఆమె స్పందించారు.. ‘నిందితుడి తండ్రి చెప్తున్న సారీ దేనికి..? నా జీవితాన్ని నాశనం చేసినందుకా..? నేను మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన సారీ చెప్పారు. అతడిని సారీని సారీ తిరస్కరిస్తున్నందుకు నేను కూడా అతనికి సారీ చెబుతున్నా’ అన్నారు.
‘ఇదే అతడి కుమారుడికి జరిగితే.. అతడు సారీని అంగీకరిస్తాడా..? అతడి సారీతో నా ప్రపంచం నాకు తిరిగి వస్తుందా..? నేనేం చేయాలి..? నాకు ఇక రాత్రులు పగళ్లు లేవు. నేను పని చేయడంలో అర్థం లేదు. నా బతుకుకు అర్థం లేదు. నా బతుకు మళ్లీ సాధారణం అవుతుందా..?’ అని ఇన్నా మాకన్ రోధించారు. తన కొడుకు ఫొటోను పట్టుకుని ఏడ్చారు.