AA23 Explosion | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ #AA23. కేవలం ఒక చిన్న అనౌన్స్మెంట్ వీడియోతోనే సరికొత్త చరిత్రను సృష్టించింది ఈ కాంబో. అయితే సినిమా కోసం సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ #23Theme అనే పాటను కంపోజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పాట ఇన్స్టాగ్రామ్లో అరుదైన రికార్డును అందుకుంది. ఈ పాటకి ఇన్స్టాలో 1 మిలియన్ కంటే ఎక్కువ రీల్స్ అందుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో ఒక ఇండియన్ ఫిల్మ్ అనౌన్స్మెంట్ థీమ్ OST ఈ స్థాయిలో వైరల్ అవ్వడం ఇదే తొలిసారి అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అరుదైన ఘనత సాధించిన సందర్భంగా అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ 2026లో ప్రారంభం కానుంది.