దుబాయ్: హార్దిక్ పాండ్యా ఓ స్టయిలిష్ ప్లేయర్. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కీలకమైన బాబర్ వికెట్‌ను తీశాడు. అతనికి వాచీలంటే తెగ మోజు. ఆ టేస్టే ఏంటో పాక్‌తో మ్యాచ్‌లో ప్రదర్శించాడతను. సుమారు 7 కోట్లు ఖరీదు చేసే వాచ్‌ను పెట్టుకుని అతను మ్యాచ్ ఆడాడు. ఇక సోషల్ మీడియాలో అతని స్టయిల్స్ గురించి యూజర్స్ తెగ కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి పాక్‌తో మ్యాచ్‌లో 8 ఓవర్లు వేసిన పాండ్యా కేవలం 31 రన్స్ మాత్రమే ఇచ్చాడు. కీలకమైన దశలో రెండు వికెట్లు తీసుకున్నాడు.
Hardik Pandya wearing a Richard Mille—likely the RM 27-02 Tourbillon Rafael Nadal, worth nearly ₹7 crore—while bowling during the India vs. Pakistan match is probably the first time I’ve seen a cricketer sporting an ultra-luxury watch during a live game.
While it’s common to… pic.twitter.com/DiIb4Z395s
— Rahul Deshpande (@rahuldeshpande2) February 23, 2025
లగ్జరీ బ్రాండ్లను ఇష్టపడే హార్దిక్.. రిచర్డ్ మిలీ ఆర్ఎం 27-02 చేతి వాచీని ధరించాడు. అమెరికా మార్కెట్లో దాని విలువ 8 లక్షల డాలర్లు. రిచర్డ్ మిలీ వాచీని కోటీశ్వర్లు కూడా ధరించడం అరుదే. వాస్తవానికి ఈ వాచీని.. టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ రఫేల్ నాదల్ కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. కార్బన్ టీపీటీ యునీబాడీ బేస్‌ప్లేట్ ఈ వాచీ ప్రత్యేకత. దీని వల్ల ఆ వాచీకి షాక్ రెసిస్టెన్స్, డ్యూరబులిటీ అధికంగా ఉంటాయి.
హార్దిక్ పాండ్యా పెట్టుకున్న రిచర్డ్ మిలీ వాచీ లాంటి వాచ్‌లు ఇప్పటి వరకు కేవలం 50 మాత్రమే ఉత్పతి చేసినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో హార్దిక్ కొత్త మైలురాయి అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 200 వికెట్లు తీసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్, సౌద్ షకీల్ వికెట్లను పడగొట్టేశాడు. ఇద్దరూ మంచి టచ్‌లో ఉన్న సమయంలోనే వాళ్ల వికెట్లను తీశాడు. 30.76 సగటుతో 200 వికెట్లు తీసిన ఆల్‌రౌండర్ అయ్యాడు.