Hardik Pandya : బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతుంటాయి. గుండెధైర్యంతో గడ్డు రోజుల్ని దాటితేనే జీవితంలో ముందుకెళ్లగలం.. ఈ సామెతలు మనం వింటూనే ఉంటాం. కానీ, హార్దిక్ పాండ్యా (Hardik Pandya) విషయంలో ఇవి నిజంగానే నిజం అనిపిస్తాయి. అవును.. ఐపీఎల్లో విజయవంతమైన ఆటగాడైన పాండ్యా.. నిరుడు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) సారథిగా ఛీత్కారాలు, అవమానాలు ఎదుర్కొన్నాడు. సొంత ప్రేక్షకులే గేలి చేసినా మౌనంగా భరించాడు. టీ20 వరల్డ్ కప్ విజేతగా స్వదేశం వచ్చిన ఈ బరోడా స్టార్.. ఇప్పుడు ముంబై కెప్టెన్‌గా విజయవంతమయ్యాడు.
18వ ఎడిషన్‌లో తొలి రెండు మ్యాచులు ఓడిన జట్టును గెలుపు బాట పట్టించి ఏకంగా ప్లే ఆఫ్స్‌కు తీసుకెళ్లాడు పాండ్యా. దాంతో.. నిరుడు అతడిపై ద్వేషంతో రగిలిపోయిన ముంబై అభిమానులు.. ఇప్పుడు జేజేలు పలుకుతున్నారు. ‘నాయకుడా.. నువ్వు సూపర్’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మాజీ క్రికెటర్లు సైతం పాండ్యా సారథ్యాన్ని వేనోళ్ల పొగుడుతున్నారు.
Special night at Wankhede, once again 💙 https://t.co/7Z7zMXROx1
— Mumbai Indians (@mipaltan) May 21, 2025
ఐపీఎల్ 18వ సీజన్లో ముంబైని ముందుండి నడిపించిన పాండ్యా జట్టును ప్లే ఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. టీ20ల్లో తాను ఇప్పటికీ ఉత్తమ కెప్టెన్ అని మరోసారి చాటుకున్నాడు. దాంతో, పాండ్యాను మాజీ ఆటగాడు అజయ్ జడేజా (Ajay Jadeja) ఆకాశానికెత్తాశాడు. ‘పాండ్యా అద్భుతమైన క్రికెటర్. అతడి కెప్టెన్సీ నిజంగా వైవిధ్యంగా అనిపిస్తుంది. దురదృష్టవశాత్తూ 17వ సీజన్లో అతడు విజయవంతం కాలేదు. కానీ, ఈసారి అతడు ఎంతో మెరుగయ్యాడు. ప్రశాంతంగా ఉంటూనే జట్టులో స్ఫూర్తి నింపాడు. మైదానంలోకి దిగాడంటే ఓటమిని అస్సలు ఒప్పుకోడు అతడు. అదే లక్షణం పాండ్యాను గొప్ప నాయకుడిని చేస్తుంది’ అని జడేజా తెలిపాడు.
ఐపీఎల్ 17వ సీజన్లో తన మనసుకు అయిన గాయాల నుంచి తేరుకున్న పాండ్యా కొత్త మనిషిలా 18వ సీజన్లో అడుగు పెట్టాడు. ఒక మ్యాచ్ నిషేధం కారణంగా రెండో మ్యాచ్‌తో పగ్గాలు అందుకున్న ఈ ఆల్‌రౌండర్ .. సారథిగా తన ముద్ర వేశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో సహృదయ వాతావరణం ఏర్పడేలా చుసుకుని.. కోచ్ మహేలా జయవర్ధనే సూచనలను ఆచరణలో పెట్టాడు. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ముంబైని వాంఖడేలో గెలుపు బాట పట్టించిన పాండ్యా.. తనకున్న వనరుల్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ఫీల్డింగ్‌లో మార్పుల నుంచి.. సరైన సమయంలో స్పిన్నర్లను దింపడం.. బౌలర్లను సమర్ధంగా వినియోగించుకోవడం వరకూ అన్నింటా పాండ్యా తెలివిగా వ్యవహరించాడు.
Meet the 𝐅𝐈𝐑𝐒𝐓 𝐂𝐀𝐏𝐓𝐀𝐈𝐍 in #TATAIPL history to take a 5️⃣-wicket haul 🫡#MI skipper Hardik Pandya shines with the ball against #LSG with his maiden TATA IPL Fifer 🔥
Updates ▶️ https://t.co/HHS1Gsaw71#LSGvMI | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/QGB6ySKRBi
— IndianPremierLeague (@IPL) April 4, 2025
మిడిల్, డెత్ ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)తో కలిసి ధనాధన్ బ్యాటింగ్ చేసిన కెప్టెన్.. మ్యచ్ విన్నర్‌గా అవతరించాడు. లక్నో సూపర్ జెయింట్స్(LSG) హిట్టర్ల ధాటికి ప్రధాన పేసర్లు తేలిపోయిన వేళ 5 వికెట్లతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు పాండ్యా. 12 మ్యాచుల్లో 161 స్ట్రయిక్ రేటుతో 161 పరుగులు చేసిన ముంబై సారథి.. అత్యధిక స్కోర్ 48 నాటౌట్. బంతితోనూ రాణించిన అతడు 9.18 ఎకానమీతో 13 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఎడిషన్‌లో రెండో వారం నుంచి పుంజుకున్న ముంబై.. సమిష్టిగా ఆదరగొడుతూ ప్లే ఆఫ్స్ బరిలో నిలిచింది. మే 21 బుధవారం వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 59 పరుగుల తేడాతో గెలుపొందిన చివరి బెర్తు ఖరారు చేసుకుంది. తదుపరి చివరి లీగ్ మ్యాచ్‌లో పాండ్యా సేన మే26న పంజాబ్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది.