ఖమ్మం రూరల్, మే 22 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో కాటమయ్య (శ్రీకంఠ మల్లేశ్వర స్వామి) మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గౌడ సంఘం యువకులు, కల్లుగీత కార్మికులు కాటమయ్య మాలాధారణ స్వీకరించారు. అనంతరం గౌడ పెద్దలు కాటమయ్య గుడి ప్రాంగణంలో గౌడ పురాణం సంబంధించిన కథను ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు గ్రామంలో కాటమయ్య వేడుకలు కొనసాగనున్నట్లు గౌడ సంఘం నాయకులు తెలిపారు. శుక్రవారం జల బిందెలు, శనివారం రేణుక ఎల్లమ్మకు బోనాల సమర్పణ, ఆదివారం బలి పూజతో మహోత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు.
Khammam Rural : ముత్తగూడెంలో ఘనంగా కాటమయ్య వేడుకలు