Hardik Pandya : భారత క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. టీ20 ప్రపంచకప్ హీరో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) వచ్చేస్తున్నాడు. ఆసియా కప్‌లో గాయం కారణంగా రెండు నెలలకుపైగా జట్టుకు దూరమైన ఈ బరోడా క్రికెటర్‌కు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి జాతీయ జట్టులోకి పునరాగమనం చేయాలనుకుంటున్నాడు పాండ్యా. సయ్యద్ ముస్తాక్ అలీ (Syed Mushtaq Ali Trophy) ట్రోఫీలో బరోడా తరఫున బరిలోకి దిగనున్నాడీ ఇండియన్ స్టార్.
ఆసియా కప్‌లో ఎడమ కాలి తొడకండరాల గాయంతో బాధపడిన పాండ్యా ప్రస్తుతం కోలుకున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరమైన అతడు.. తాజాగా అక్టోబర్ 14న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరాడు. నెలకుపైగా నిపుణుల సమక్షంలో బౌలింగ్ సాధన చేసిన అతడు పట్టు సాధించాడు. నవంబర్ 30న అక్కడ ఫిట్నెస్ నిరూపించుకున్న ఈ ఆల్‌రౌండర్ దేశవాళీలో ఆడేందుకు మార్గం సుగమమైంది.
Hardik Pandya will make his return from injury for Baroda this week in the Syed Mushtaq Ali Trophy, aiming to prove his fitness ahead of India’s five-match T20I series against South Africa pic.twitter.com/OBpmR2ji8Y
— ESPNcricinfo (@ESPNcricinfo) December 1, 2025
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో డిసెంబర్ 2న పంజాబ్‌తో, డిసెంబర్ 4న గుజరాత్‌తో బరోడా తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల తర్వాత పాండ్యా ఫిట్నెస్ను బట్టి మరో మ్యాచ్ ఆడిస్తామని బరోడా క్రికెట్ వెల్లడించింది. ఈ టోర్నీలో పాండ్యా బౌలింగ్, బ్యాటింగ్‌ను జాతీయ సెలెక్టర్ ప్రజ్ఞాన్ ఓజా (Pragnan Ojha) పరీశీలించనున్నాడు. పాండ్యా ఫిట్నెస్, ప్రదర్శన గురించి చీఫ్ సెలెక్టర్‌కు అతడు రిపోర్టు ఇవ్వనున్నాడు. అప్పుడు అంతా ఒకే అనిపిస్తే.. సఫారీలతో టీ20 సిరీస్‌లో పాండ్యా ఆడినా ఆశ్చర్యం అక్కర్లేదు. డిసెంబర్ 9 నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య పొట్టి సిరీస్ మొదలవ్వనుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ సన్నద్ధతలో ఉన్న టీమిండియాకు పాండ్యా పునరాగమనం బిగ్ బూస్ట్ కానుంది.
Hardik Pandya shares adorable moments with Mahieka Sharma amid recovery for IND vs SA 2025 ODIs [In Pictures] https://t.co/UgQ95tyTpA pic.twitter.com/JO6cJx29UO
— Sportskeeda (@Sportskeeda) November 18, 2025
నిరుడు పొట్టి వరల్డ్ కప్ తర్వాత భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోయిన పాండ్యా మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. మోడల్, అస్సామీ నటి అయిన మహీకా శర్మ(Mahieka Sharma) తో అతడు ఎఫైర్ సాగిస్తున్నాడు. వీరిద్దరూ గత కొంత కాలంగా తరచూ మీడియా కంటపడుతున్నారు. మరి. ఈ క్యూట్ జంట పెళ్లి కబురు ఎప్పుడు చెబుతారోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నురు.