దుబాయ్ : ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) ఓ స్టయిలిష్ ప్లేయర్. ఆసియాకప్ టీ20 టోర్నీ కోసం అతను ఫుల్‌గా ప్రిపేరవుతున్నాడు. అయితే ట్రైనింగ్ సెషన్లో తాజాగా పాండ్యా ధరించిన వాచీపై అందరి ఫోకస్ పడింది. హార్దిక్ తన చేయికి రిచర్డ్ మిల్లీ ఆర్ఎం 27-04 మోడల్ వాచీని ధరించాడు. ఆ వాచీ పెట్టుకుని అతను ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. అయితే ఆ వాచీ ఖరీదు సుమారు 20 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఆసియా కప్ టోర్నీ ప్రైజ్‌మనీ కన్నా 8 రెట్లు ఎక్కువ అని అంచనా వేస్తున్నారు. ఆసియాకప్ ప్రైజ్‌మనీ కేవలం 2.6 కోట్లు మాత్రమే. అల్ట్రా లగ్జరీ వాచీని.. టెన్నిస్ లెజెండ్ రఫేల్ నాదల్‌తో కలిసి కంపెనీ తయారు చేసింది. రిచర్డ్ మిల్లే ఆర్ఎం వాచీలను కేవలం 50 మాత్రమే తయారు చేసింది కంపెనీ.
నిజానికి పాండ్యాకు వాచీలు అంటే ఇష్టం. ప్రతిసారి కొత్త కొత్త టోర్నీల్లో అతను కొత్త వాచీలతో ఆకట్టుకుంటాడు. ఇటీవల జరిగిన ఓ టోర్నీలో అతను రిచర్డ్ మిల్లే ఆర్ఎం 27-02 వాచీని పెట్టుకున్నాడు. దానికి ఖరీదు సుమారు ఏడు కోట్లు ఉంటుంది. సెప్టెంబర్ పదో తేదీన ఇండియా తన ఫస్ట్ మ్యాచ్ ఆడనున్నది. యూఏఈ జట్టుతో ఆ మ్యాచ్ ఉంటుంది. ఇక 14వ తేదీన పాకిస్థాన్‌తో, 19వ తేదీన ఓమన్‌తో తొలి రౌండ్ మ్యాచ్‌లు ఆడుతుంది.