జలంధర్: రాజకీయ అరంగేట్రంపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేని భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ అన్నాడు. పలు పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయని, కానీ అందుకు తగ్గట్లు మానసికంగా సిద్ధమైన తర్వాతే రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశాడు. తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికిన 41 ఏండ్ల భజ్జీ..శనివారం మీడియాతో మాట్లాడుతూ ‘భవిష్యత్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. క్రికెట్ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. రాజకీయాల్లోకి రావాలనుకుంటే కచ్చితంగా అందరికీ చెప్పి వస్తా. నిజాయితీగా చెప్పదల్చుకున్నా ఇప్పటికైతే ఆలోచించలేదు. రాజకీయాలు మంచి డిమాండ్ ఉన్న ఉద్యోగం. ప్రస్తుతానికైతే కుటుంబంతో గడపాలనుకుంటున్నా’ అని అన్నాడు.