Hanuma Vihari : భారత మాజీ క్రికెటర్ హనుమా విహరి (Hanuma Vihari ) కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ సీజన్లో మొదటిదైన దులీప్ ట్రోఫీకి మూడు రోజులు ఉందనగా ఆంధ్ర క్రికెట్ సంఘం (ACA)తో తెగతెంపులకు సిద్దమయ్యాడు. ఈసారి అతడు కొత్త జట్టుకు ఆడాలని భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని ఏసీకేకు తెలియజేశాడు కూడా. తనును కెప్టెన్సీ నుంచి తప్పించడం.. ఒక రాజకీయనేత కుమారిడి ప్రోద్భలంతో తనను తప్పుపట్టడం.. వంటి కారణాలతో ఏసీకే పట్ల అసంతృప్తితో ఉన్న విహరి తనకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరాడు.
‘నేను జట్టు మారాలని అనుకుంటున్నా. త్రిపుర సెలెక్టర్లు నాతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాబట్టి నాకు ఎన్ఓసీ ఇవ్వగలరు’ అని విహరి ఆంధ్ర క్రికెట్ సంఘానికి విన్నవించాడు. రంజీల్లో రాణించి భారత జట్టుకు ఎంపికైన విహరి 16 టెస్టులు ఆడాడు. ఆస్ట్రేలియా పర్యటన (2021-22)లో టీమిండియా టెస్టు సిరీస్ నెగ్గడంలో విహరి కీలక పాత్ర పోషించాడీ సొగసరి బ్యాటర్. అయితే.. గాయం కారణంగా ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. అంతే మళ్లీ ఎంపికవ్వలేదు.
This Happened in BGT 2020-21 at Sydney Cricket Ground 🏟️
~ Ravi Ashwin and Hanuma Vihari’s 62* Runs Partnership in 259 Balls saved the Sydney Test and Then, India in next test conquered Gabba to win the series 2-1👏🏻
~ Can, India 🇮🇳 repeat this Miracle in Manchester 🤔 pic.twitter.com/ADFiI7S2Hl
— Richard Kettleborough (@RichKettle07) July 27, 2025
అయితే.. దేశవాళీలో ఆంధ్రా క్రికెట్ జట్టు (Andhra Cricket Team) తరఫున విహరి అద్భుత ప్రదర్శన చేశాడు. కానీ, అనూహ్య పరిస్థితుల్లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అంతేకాదు భవిష్యత్‌లో ఆంధ్రా జట్టుకు ఆడనని వెల్లడించాడు.’ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నన్ను ఎంతో వేధనకు గురి చేసింది. నా ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసింది. ఓ రాజకీయ నాయకుడి కుమారుడి కోసం నన్ను బలి చేశారు’ అని విహరి తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. దాంతో, ఆంధ్రా క్రికెట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
రంజీ ట్రోఫీ 2023-24 క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రా జట్టు ఓడిపోయింది. మధ్యప్రదేశ్ చేతిలో 4 పరగుల తేడాతో పరాజయం పాలైంది. ఈమ్యాచ్ అనంతరం విహరి.. తాను ఆంధ్రా జట్టును వీడుతున్నట్టు పోస్ట్ పెట్టాడు. రాజకీయ బలమున్న పృథ్వీ రాజ్‌కు వత్తాసు పలికి తనను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారని ఆదేదనకు గురయ్యాడు. విహరి ఆంధ్రా తరఫున 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అంతకంటే ముందు అతడు హైదరాబాద్‌కు ఒక సీజన్ మొత్తం ప్రాతినిధ్యం వహించాడు.