వెల్లింగ్టన్: ఇంగ్లండ్ బౌలర్ గస్ అట్కిన్సన్(Gus Atkinson) హ్యాట్రిక్ తీశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు .. ఇంగ్లండ్ బౌలర్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో కివీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 125 పరుగులకే ఆలౌటైంది. పేస్ బౌలర్ అట్కిన్సన్ వరుసగా నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ వికెట్లను తీశాడు. ఈ ఏడాదే టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు అట్కిన్సన్. జూలైలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో అతను 12 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 26 ఏళ్ల ఆ బౌలర్ ఆగస్టులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓ సెంచరీతో పాటు అయిదు వికెట్లు తీశాడు.
టెస్టు క్రికెట్లో 2017 తర్వాత హ్యాట్రిక్ తీసిన ఇంగ్లండ్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఆ ఏడాది మొయిన్ అలీ హ్యాట్రిక్ తీశాడు. ఇప్పటి వరకు 14 మంది ఇంగ్లండ్ బౌలర్లు టెస్టుల్లో హ్యాట్రిక్ తీశారు. అయితే స్టువర్ట్ బ్రాడ్ రెండు సార్లు హ్యాట్రిక్ తీశాడు. వెల్లింగ్టన్ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కివీస్ 125 రన్స్‌కు ఔటవ్వగా.. ఇంగ్లండ్‌కు ఆధిక్యం లభించింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 66 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 315 రన్స్ చేసింది.
HAT-TRICK FOR GUS ATKINSON!
Nathan Smith ❌
Matt Henry ❌
Tim Southee ❌pic.twitter.com/T91cEE074l— CricketGully (@thecricketgully) December 7, 2024