హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన 18మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు సంస్థ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
అండర్-14 విభాగంలో సిద్ధు, చరంజిత్, హిమాన్షు, కార్తికేయ, 17 ఏళ్ల విభాగంలో శ్రీవత్స , అరవింద్, రాము, పాల్ సురేష్, శివ, అభిలాష్, హేమంత్, మనోహర్, చంద్రశేఖర్, రామ్చరణ్, టెస్విక్ వర్మ, అఖిరానంద్, సిద్ధార్థ, అనిల్ కుమార్ తదితరులున్నారు. రెజ్లింగ్ పోటీలకు ఎంపికైన విద్యార్థులకు సొసైటీ సెక్రటరీ వర్షిణి, ఇతర ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర స్థాయిలోనూ సత్తా చాటాలని అభిలాషించారు.