కాటారం, డిసెంబర్ 21: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ(బాలుర) గురుకుల కళాశాల విద్యార్థి నిఖిల్ జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. సంగారెడ్డిలో ఇటీవల జరిగిన 44వ రాష్ట్ర స్థాయి ఖోఖో టోర్నీ అండర్-18 విభాగంలో పెద్దపల్లి జిల్లా తరఫున నిఖిల్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు.
ఈనెల 30 నుంచి జనవరి 4 వరకు కర్ణాటకలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున నిఖిల్ పోటీపడుతాడని ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి కుమార్ పేర్కొన్నారు. జాతీయ టోర్నీకి ఎంపికైన నిఖిల్ను గురుకుల ప్రిన్సిపాల్ మాధవి, వెంకటయ్య, బలరాం, పీడీ మహేందర్, పీఈటీ శ్రీనివాస్, కోచ్ వెంకటేశ్ అభినందించారు.