హైదరాబాద్, జూలై31 (నమస్తే తెలంగాణ): యాచ్క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన టీసాన్ యూత్ ఓపెన్ రెగెట్టా పోటీల్లో బీసీ గురుకుల సొసైటీకి చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారు. జాతీయ స్థాయిలో నిలిచిన విద్యార్థి అక్షర, ఆప్టిమిస్ట్ మెయిన్ ఫ్లీట్ విభాగంలో శిరీష, హనుమంతు వెండి, కాంస్య పతకాలను సాధించారు.
ప్రతిభ చూపిన విద్యార్థులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్యదర్శి శ్రీధర్, గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు, సంయుక్త కార్యదర్శి తిరుపతి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.