ENG vs PAK : మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై హత్యాయత్నం ఘటన మరవక ముందే పాకిస్థాన్‌లో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఈసారి పాకిస్థాన్ టూర్లో ఉన్న ఇంగ్లండ్ ఆటగాళ్లు బస చేసిన హోటల్‌కు సమీపంలో బుల్లెట్ శబ్దాలు వినిపించాయి. వాళ్లు ఉన్న హోటల్‌కు కిలోమీటర్ దూరంలో గురువారం ఉదయం తుపాకీ కాల్పుల శద్దం వినిపించింది. దాంతో, అప్రమత్తమైన పాకిస్థాన్ పోలీసులు నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. స్థానిక ముఠాల మధ్య జరిగిన గొడవలో తుపాకీ కాల్పులు జరిగాయని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పాకిస్థాన్ పోలీసు అధికారులు వెల్లడించారు.
2009 మార్చిలో పాక్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెట్ టీమ్ మీద కొందరు దుండగులు కాల్పులు జరిపారు. శ్రీలంక ఆటగాళ్లు బస్సులో వెళ్తుండగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియం సమీపంలో 12 మంది కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు శ్రీలంక ఆటగాళ్లు గాయపడ్డారు. ఆరుగురు పాకిస్థాన్ పోలీసులు, ఇద్దరు పౌరులు చనిపోయారు. అందుకనే భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ పర్యటనకు వెళ్లేందుకు భారత్ సహా మిగతా దేశాలు ఆలోచిస్తుంటాయి.
రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు ముల్తాన్‌లోని ఒక హోటల్లో ఉంది. ఆ ఈ ఘటన తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు పోలీసులు భారీ భద్రత కల్పించారు. ఆటగాళ్లు హోటల్ నుంచి స్టేడియంకు వెళ్లేదారిలో ఇతర వాహనాలను అనుమతించలేదు. ఇంగ్లండ్ ప్లేయర్లు అరగంట పాటు నెట్ ప్రాక్టీస్‌ను కొనసాగించారు. శుక్రవారం రెండో టెస్టు ప్రారంభం కానుంది. మొదటి టెస్టులో చిరస్మరణీయ విజయం సాధించిన ఇంగ్లండ్ మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. అయితే ఇంగ్లండ్ జట్టు కూర్పులో చిన్న మార్పు చేసింది. గాయపడిన ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్ స్థానంలో మార్క్‌వుడ్‌ను తీసుకుంది.