పనాజీ(గోవా): ప్రతిష్టాత్మక చెస్ ప్రపంచకప్‌లో భారత స్టార్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మూడో రౌండ్ పోరులో గుకేశ్..ఫ్రెడిక్ స్వేన్(జర్మనీ) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మూడో రౌండ్ రెండో గేమ్‌లో గుకేశ్ స్వీయతప్పిదం ఓటమి వైపు నిలిపింది. స్వేన్ నుంచి ఇటాలియన్ ఓపెన్‌ను అంచనా వేయలేకపోయిన గుకేశ్ గేమ్ కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు తెలంగాణ జీఎం అర్జున్ ఇరిగేసి శంసిద్దీన్ వొకిదోవ్(ఉజ్బెకిస్థాన్)తో గేమ్‌ను డ్రా చేసుకోగా, ప్రజ్ఞానంద 1.5-0.5తో రాబర్ట్(అర్మేనియా)పై ఓడిం చి నాలుగో రౌండ్లోకి ప్రవేశించా డు. డానియల్‌తో గేమ్‌ను హరికృష్ణ డ్రా చేసుకున్నాడు.