D Gukesh : చదరంగంలో అద్భుత విజయాలతో అదరగొడుతున్న దొమ్మరాజు గుకేశ్(D Gukesh) తన వ్యక్తిత్వంతో మనసులు గెలుచుకుంటున్నాడు. ‘చెస్ ఛాంపియన్స్ షోడౌన్ 2025’లో గొప్పగా రాణిస్తున్న అతడు.. ఇటీవల తనపై విజయం సాధించి అతి చేసిన అమెరికా గ్రాండ్‌మాస్టర్ హికరు నకమురా(Hikaru Nakamura)పై ప్రతీకారం తీర్చుకున్నాడు. సెయింట్ లూయిస్‌లో జరిగిన మ్యాచ్‌లో నకమురా వ్యూహాలను చిత్తు చేసిన గుకేశ్ నాలుగు పాయింట్లు సాధించాడు. మ్యాచ్ గెలుపొందిన తర్వాత.. గుకేశ్ హుందాగా ప్రవర్తించాడు. నకమురా మాదిరిగా అతడి రాజును ప్రేక్షకుల మీదకు విసరలేదతడు. సింపుల్‌గా షేక్ హ్యాండ్ ఇచ్చి.. విజేత లక్షణం ఇది అని చాటాడు గుకేశ్. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది.
నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్( Magnus Carlsen)తో మ్యాచ్‌లో ఓడిన గుకేశ్ తర్వాతి పోరులో నకమురాకు చెక్ పెట్టాడు. దుందుడుకు స్వభావి అయిన అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించి తగిన బుద్ది చెప్పాడు. అక్టోబర్ తొలి వారంలో చెక్‌మేట్ టోర్నమెంట్లో తనను ఓడించిన తర్వాత కింగ్‌ను జనాల్లోకి విసిరి హద్దుమీరిన నకమురాకు ప్రశాంత వదనంతో బదులిచ్చాడు. హైలెట్ ఏంటంటే.. మ్యాచ్ పూర్తయ్యాక గుకేశ్ ఏకొంచెం కూడా హంగామా చేయలేదు.
#Watch | D Gukesh won hearts with his calm and composed demeanour after defeating American Grandmaster Hikaru Nakamura in the Clutch Chess Champions Showdown 2025 in Saint Louis.
The victory came as sweet revenge against Nakamura, who had earlier sparked controversy by throwing… pic.twitter.com/nHF2p98Y03
— NDTV (@ndtv) October 28, 2025
కూల్‌గా ఉండి నకమురాకు షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా ద్రుఢ చిత్తంతో వ్యవహరించే గుకేశ్‌పై మాజీ గ్రాండ్‌మాస్టర్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. గోవా వేదికగా అక్టోబర్ 30 నుంచి ప్రారంభం కానున్న చెస్ వరల్డ్ కప్‌లో గుకేశ్ భారత బృందానికి నేతృత్వం వహించనున్న విషయం తెలిసిందే.
‘చదరంగం ప్రపంచకప్ పోటీల కోసం ఆతృతగా చూస్తున్నా. భారత దేశంలో ఎక్కడ చెస్ ఆడినా గొప్పగా అనిపిస్తుంది. గోవాతో అయితే నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ నేను కొన్ని జూనియర్ ఈవెంట్స్‌లో కూడా పాల్గొన్నాను. ఈసారి వరల్డ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుండడం గొప్ప అనుభూతి ఇవ్వనుంది. అందుకే.. చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’ అని గుకేశ్ వెల్లడించాడు. చివరిసారిగా గోవాలో అతడు 2019లో కేటగిరీ ‘ఏ’ చెస్ పోటీల్లో పాల్గొన్నాడు. కానీ,10వ స్థానంతో నిరాశపరిచాడు.