న్యూఢిల్లీ: ఫిడే తాజా ర్యాంకింగ్స్‌లో Indian Grandmasters సత్తాచాటారు. ఇటీవల కాలంలో నిలకడగా రాణిస్తూ ప్రపంచవిజేతగా నిలిచిన దొమ్మరాజు గుకేశ్‌తో పాటు యువ జీఎం ప్రజ్ఞానంద తమ ర్యాంకింగ్స్ మెరుగుపర్చుకున్నారు. గత డిసెంబర్లో సింగపూర్‌లో జరిగిన ప్రపంచ చెస్చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన గుకేశ్(2877) తన కెరీర్లో అత్యుత్తమంగా 3వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
మాగ్నస్ కార్ల్సన్(2833), హికారు నకాముర(2802) వరుసగా తొలి రెండు ర్యాంక్‌ల్లో ఉన్నారు. ఇన్ని రోజులు భారత తరఫున అత్యుత్తమ ర్యాంకర్‌గా కొనసాగిన ఇరిగేసి అర్జున్ (2777) ఐదు ర్యాంక్‌కు పడిపోయాడు. ప్రజ్ఞానంద(2758) 17 పాయింట్లతో తొలిసారి ఎనిమిది ర్యాంక్‌కు చేరుకున్నాడు.