హైదరాబాద్: గుజరాత్ టైటాన్స్ సీనియర్ పేసర్ ఇషాంత్శర్మపై జరిమానా పడింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కారణంగా ఇషాంత్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు పేర్కొన్నారు.
ఐపీఎల్ ప్రవర్తనా నియామవళి లెవల్-1 తప్పిదం ఆర్టికల్ 2.2 అనుసరించి ఇషాంత్‌పై జరిమానా వేసినట్లు లీగ్ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయం. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లాడిన ఇషాంత్ ఒక వికెట్ తీసి 107 పరుగులిచ్చుకున్నాడు.