గెలుపు వాకిట బోల్తా.. ఢిల్లీపై గుజరాత్ ఉత్కంఠ విజయం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ తమ రెండో మ్యాచ్‌లో గెలుపువాకిట బోల్తా కొట్టింది.
- లీ, వోల్వార్ట్ మెరుపులు వృథా
- డివైన్ ధనాధన్
ముంబై: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ తమ రెండో మ్యాచ్‌లో గెలుపువాకిట బోల్తా కొట్టింది. ఆదివారం ముంబై వేదికగా గుజరాత్ జెయింట్స్‌తో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో క్యాపిటల్స్.. 210 పరుగుల రికార్డు ఛేదనలో గెలుపునకు చేరువగా వచ్చినా 4 పరుగుల తేడాతో పరాభవం పాలై టోర్నీలో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది.
భారీ స్కోర్లు నమోదైన పోరులో జెయింట్స్ నిర్దేశించిన 210 పరుగుల ఛేదనలో క్యాపిటల్స్.. 20 ఓవర్లలో 205/5 వద్దే ఆగిపోయింది. లిజెల్లె లీ (54 బంతుల్లో 86, 12 ఫోర్లు, 3 సిక్సర్లు), లారా వోల్వార్ట్ (38 బంతుల్లో 77, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించినా కీలక సమయంలో వికెట్లు కోల్పోయిన ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది. ఆఖరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 7 పరుగులు అవసరమవగా.. క్రీజులో వోల్వార్ట్, జెమీమా (15) క్రీజులో ఉన్నా డివైన్ 2 పరుగులే ఇచ్చి ఆ ఇద్దరినీ ఔట్ చేసి క్యాపిటల్స్ ఆశలపై నీళ్లు చల్లింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన జెయింట్స్ తరఫున ఓపెనర్ సోఫీ డివైన్ (42 బంతుల్లో 95, 7 ఫోర్లు, 8 సిక్స్‌లు), ఆష్లీ గార్డ్నర్ (26 బంతుల్లో 49, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసకర ఆటతో నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 209 రన్స్‌కు ఆలౌట్ అయింది. డబ్ల్యూపీఎల్ కెరీర్లో రెండో మ్యాచ్ ఆడుతున్న ఢిల్లీ బౌలర్ నందిని శర్మ (5/33) హ్యాట్రిక్ నమోదుచేయడం విశేషం.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 20 ఓవర్లలో 209 (డివైన్ 95, గార్డ్నర్ 49, నందిని 5/33, చరణి 2/42);
ఢిల్లీ: 20 ఓవర్లలో 205/5 (లీ 86, వోల్వార్ట్ 77, డివైన్ 2/21, రాజేశ్వరి 2/34)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

