DC vs GG : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)14వ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ (Gujarat Gaints) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఉత్కంఠ పోరులో పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు షాకిచ్చింది. 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో, టోర్నమెంట్లో రెండో విక్టరీ నమోదు చేసింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ప్రధాన బ్యాటర్లు విఫలం కావడంతో ఢిల్లీ ఓటమి పాలైంది. ఈ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది రెండో ఓటమి.
కీలక మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. 48 టార్గెట్ ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 136కు ఆలౌట్ చేసింది. 18.5వ ఓవర్లో పూనమ్ యాదవ్ ఔట్ కావడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 147 రన్స్ చేసింది. ఓపెనర్ లారా వోల్వార్డ్త్(57), అష్ గార్డ్నర్ (51) అర్ధ శతకాలతో రాణించారు. హాఫ్ సెంచరీ చేయడంతో పాటు రెండు వికెట్లు తీసిన అష్ గార్డ్నర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
రెండో ఓవర్లోనే షఫాలీ వర్మ (8)బౌల్డ్ అయింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది. మేగ్ లానింగ్(18), అలిసే క్యాప్సే(21), జెమీమా రోడ్రిగ్స్ (1) వెంట వెంటనే ఔటయ్యారు. 52 పరుగులకే నాలుగు వికెట్లు పడ్డాయి. ఒక వైపు వికెట్లు పడుతున్నా మరిజానే (31) ధాటిగా ఆడింది. జొనాసెన్ (4) తో ఐదో వికెట్‌కు 29 రన్స్ జోడించింది. మరిజానే రనౌట్ కావడంతో ఢిల్లీ మరింత కష్టాల్లో పడింది. చివర్లో అరుంధతి రెడ్డి (25) బ్యాట్ ఝులిపించడంతో ఢిల్లీ 130 ప్లస్ రన్స్ చేయగలిగింది. తొమ్మిదో వికెట్‌కు శిఖా పాండేతో అరుంధతి 30 రన్స్ జోడించింది. తానియా భాటియా (0), రాధా యాదవ్ విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో అష్ గార్డ్నర్, కిమ్ గార్త్, తనూజ కన్వార్ తలా రెండేసి వికెట్లు తీశారు. హర్లీన్ డియోల్‌కు ఒక వికెట్ దక్కింది.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఓపెనర్ లారా వోల్వార్డ్త్(57), అష్ గార్డ్నర్ (51) అర్ధ శతకాలతో రాణించారు. వీళ్లు దూకుడుగా ఆడి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడిన వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు 81 రన్స్ జోడించారు. తొలి మ్యాచ్‌లో విఫలమైన వోల్వార్డ్త్ ఈమ్యాచ్‌లో రాణించింది. డబ్ల్యూపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసింది. 41 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో ఫిఫ్టీ కొట్టింది. అష్ గార్డ్నర్తో మూడో వికెట్‌కు 81పరుగులు జోడించింది. గార్డ్నర్ 33 బంతుల్లో 9 ఫోర్లతో 51 రన్స్ చేసింది. ఢిల్లీ బౌలర్లలో అరుంధతి రెడ్డి, జొనాసెన్, మరిజానే కప్ తలా ఒక వికెట్ తీశారు.