WPL | లక్నో: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) మూడో సీజన్ మ్యాచ్‌లు మరింత రంజుగా సాగుతున్నాయి. సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై గుజరాత్ జెయింట్స్ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బేత్ మూనీ(59 బంతుల్లో 96 నాటౌట్, 17ఫోర్లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో గుజరాత్ 20 ఓవర్లలో 186/5 స్కోరు చేసింది. ఎకల్‌స్టోన్ (2/34) రెండు వికెట్లు తీసింది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన యూపీ 17.1 ఓవర్లలో 105 పరుగులకు కుప్పకూలింది. కాశ్వి గౌతమ్ (3/11), తనూజ కన్వర్ (3/17) మూడేసి వికెట్లు తీశారు.