అహ్మదాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోంజీ కుంభకోణం కేసులో భారత స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌కు గుజరాత్ సీఐడీ సమన్లు జారీ చేసింది. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్న గిల్‌తో పాటు అదే జట్టుకు చెందిన సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మకు సమన్లు జారీ అయ్యాయి. బ్యాంకుల కంటే అధిక వడ్డీలు ఇస్తామని ప్రజలను మోసం చేసిన కేసులో బీజేడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ ఝలాను సీఐడీ ఇదివరకే అరెస్టు చేసి విచారించింది. ఈ గ్రూప్‌నకు చెందిన రూ. 450 కోట్ల లావాదేవీలలో టైటాన్స్ క్రికెటర్ల పెట్టుబడులు ఉన్నట్టు విచారణలో తేలింది. గిల్ రూ. 1.95 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు సమాచారం.