ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ యువ ఆటగాడు సాయి సుదర్శన్ వింతగా అవుటయ్యాడు. పొలార్డ్ వేసిన బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించిన అతను.. బ్యాలెన్స్ కోల్పోయాడు. బంతిలో వేగం లేకపోవడంతో దాన్ని మిస్ చేశాడు. అదే సమయంలో ఒక చెయ్యి జారిపోయింది.
దాంతో బ్యాటు ఒక చేతిలో మిగిలిన బ్యాటు వేగంగా వెళ్లి వికెట్లను తాకింది. దాంతో హిట్ వికెట్ రూపంలో సాయి సుదర్శన్ పెవిలియన్ చేరాడు. సాయి వెనుతిరగడంతో 138 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది.